Big Boss-7 | రెచ్చిపోయిన ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు.. ఆర్టీసీ బస్సుపై దాడి
యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్-7 (Big Boss -7) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్‌మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ (Amardeep) నిలిచాడు.
హైదరాబాద్: యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్-7 (Big Boss -7) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్‌మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ (Amardeep) నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రశాంత్ విజేత అని ప్రకటించగానే సంబురాలు చేసుకున్నారు. అయితే ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటుగా వెళ్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన సిటీ బస్సుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు.
దీంతోపాటు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ కారును చుట్టుముట్టి.. దాడిచేశారు. కారు అద్దాలు పగలగొట్టి బయటకు దిగాలంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, ఆయన భార్య భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదుచేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

