దేవరుప్పుల, ఏప్రిల్ 2: జనగామ జిల్లా దేవ రుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్ట్ నాయకురాలు గుమ్మడవెల్లి రేణు క అంత్యక్రియలు బుధవారం గ్రామంలో జరగ్గా, వేలాది మంది జనం హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
ఆమె మృతదేహం మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి చేరింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా రేణుక ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించడం బూటకమని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.