మూసాపేట(అడ్డాకుల), మే 8 : పాలమూరు జిల్లా యువ కుడు అభిలాశ్రెడ్డికి రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం వరించింది. అమెరికాలోని ‘సిస్కో’ కంపెనీ నిర్వహించిన క్యాం పస్ ప్లేస్మెంట్లో ఆయన సాప్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికయ్యా రు. అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన టీచర్ యుగంధర్‌రెడ్డి, శోభారాణి దంపతుల పెద్ద కుమారుడు అభి లాశ్ పాలమూరులో ప్రాథమిక విద్య, హైదరాబాద్‌లో ఇంట ర్ చదివి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిపోర్నియాలో ఎంఎస్‌లో చేరి ‘సిస్కో’ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికయ్యారు.