మూసాపేట, మార్చి 8 : మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు సాగునీటి కష్టా లు మొదలయ్యాయి. మూసాపేట మం డలం చక్రాపూర్కు చెందిన రైతు ఉప్పరి మల్లేశ్‌కు రెండెకరాల పొలం ఉన్నది. యాసంగిలో వరి సాగు చేయగా.. ఉన్న ఒక్క బోర్లు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో అడుగంటింది. చేసేదేమీ లేక మరో చోట బోరు వేయించాడు.
700 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేయించినా చుక్క నీరు రాలేదని రైతు మల్లేశ్ వాపోయా డు.బోరు కోసం రూ.70 వేలకుపైగానే ఖర్చు అయ్యిందని వాపోయాడు. కాగా ఇదే మండ లం చక్రాపూర్కు చెందిన రైతు ఉప్పరి వెంకటేశ్‌కు కనకాపూర్ శివారులో నాలుగెకరాల ఉండగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. ఇప్పటివరకు పెట్టుబడి రూ.లక్ష వరకు ఖర్చు చేశాడు. 15 రోజుల నుంచి బోరులో నీటిమట్టం తగ్గడంతో మరో బోరు డ్రిల్లింగ్ చేయించాడు. 450 ఫీట్ల లోతు వరకు బోరు వేసినా చుక్క నీరు రాలేదు.