హైదరాబాద్, ఫిబ్రవరి 19, (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టిం ది. పంచాయతీలో ఒకటి, మున్సిపాలిటీలో మరో ఓట రు గుర్తింపు కార్డు ఉన్న చిలకల బుగ్గ రాములు నామినేషన్ను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించింది. వేర్వేరుగా ఓటు ఉన్నా అధికారులు నామినేషన్ను తిరసరించక పోవడాన్ని సవాల్ చేస్తూ ఈగల రాములు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది సుధీర్ రావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్నాక ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఎన్నికల అధికారులైన కలెక్టర్, ఆర్డీవో, కౌన్సిలర్ బుగ్గా రాములకు జడ్జి నోటీసులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించారు. విచారణను మార్చి 5కు వాయిదా వేశారు.