దేవరుప్పుల, నవంబర్ 6: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని ఓటు హక్కుపై ములగాసి శివకుమార్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే యశస్విని ఓటుపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు, సంబంధిత జిల్లా అధికారులకు, కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయినా ఏఐసీసీ ఆమెనే పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో సదరు వ్యక్తులు నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.