హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్‌రావు ఆకస్మిక మృతికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం నేతలు ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ప్రభాకర్ మృతి పద్మశాలి సమాజానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు మాజీ విప్ అనిల్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, పుట్టా పాండురంగయ్య, బోల్ల శివశంకర్, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, నటి పూనమ్‌కౌర్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.