హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఈ నెల 17న సాయంత్రం 6:30 గంటలకు మహాపడిపూజ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్‌యాదవ్ వెల్లడించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాపడిపూజకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్టు తెలిపారు. ప్రజలకు మంచి సంకేతం ఇవ్వాలని, అ య్యప్ప సంకల్పం ఉండాలనే ఈ పూజ నిర్వహిస్తున్నామని చెప్పారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయాలు సాధించడం సంతోషకమరమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ పేర్కొన్నారు. చైతన్యవంతమైన తెలంగాణ పల్లెలు హామీలు ఎగ్గొట్టిన అధికార కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాయని స్పష్టం చేశారు. ఈ తీర్పు కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకతకు అద్దంపడుతున్నదని, అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించారని చెప్పారు. మూడో విడతలోనూ బీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని రాకేశ్‌కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రెస్మీట్లో బీఆర్ఎస్ నేతలు బాలకృష్ణ, సాయితేజరావు పాల్గొన్నారు.