హైదరాబాద్ : తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. తనపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. కరీంనగర్ సీపీపై తాను మతమార్పిడి ఆరోపణలు చేయకపోయినా చేసినట్లు ఆరోపిస్తున్నారని విమర్శించారు. తాను ఆ ఆరోపణలు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా అని తెలిపారు.
‘కరీంనగర్ సీపీపై నేను మతమార్పిడి ఆరోపణలు నేను చేయలేదు. నేను ఆ మాట అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ప్రివిలేజ్ మోషన్ వేస్తా’ అని పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.