Nallagonda | నల్లగొండ : గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలైంది.
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని నిమ్మ మార్కెట్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో మార్కెట్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దైంది. భారీ వర్షానికి తిప్పర్తి పీఏసీఎస్ కేంద్రంలో ఉన్న వరి ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. పంట నష్ట పరిహారం చెల్లించాలని వేడుకున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించాలని వారు కోరారు.
అకాల వర్షంతో వరదల్లో కొట్టుకుపోయిన ధాన్యం
నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని నిమ్మ మార్కెట్లో.. అకాల వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం
రాత్రి భారీ వర్షానికి తిప్పర్తి PACS కేంద్రంలో వరదలో కొట్టుకుపోయిన ధాన్యం
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతమైన… pic.twitter.com/ry3u9duDii
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025