e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home తెలంగాణ ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌

ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌

ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌
  • 08068065385కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే
  • నేరుగా ఇంటి వద్దకే
  • హిందుస్తాన్‌ యూనిలీవర్‌.. ‘మిషన్‌ హోప్‌’

హైదరాబాద్‌, మే 28 (నమస్తే తెలంగాణ): మీకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అవసరమా? అయితే 08068065385 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే సరి. ఆ వెంటనే హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) సంస్థకు చెందిన కార్యకర్తలు, నిపుణులు నేరుగా మీ ఇంటికే వచ్చి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను అమర్చుతారు. ఆపై దా న్ని ఎలా ఉపయోగించాలో వివరించి వెళ్తారు. ఈ సేవ పూర్తిగా ఉచి తం. పోర్టియా మెడికల్‌, కేవీఎన్‌ ఫౌండేషన్ల సహాయంతో హెచ్‌యూఎల్‌ సంస్థ ‘మిషన్‌ హోప్‌’ (మిషన్‌ హెచ్‌వో2పీఈ) పేరుతో ఈ స్వ చ్ఛంద సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘తీసుకోవడం-వాడుకోవడం-తిరిగివ్వడం’ పద్ధతిలో ఈ కార్యక్రమం సాగుతుంది. హెచ్‌యూఎల్‌ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 5 వేల కాన్సంట్రేటర్లు
రోనా కష్టకాలంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందించేలా హెచ్‌యూఎల్‌ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం ఆ సంస్థ విదేశాల నుంచి దాదాపు 5,000 కాన్సంట్రేటర్లను దిగుమతి చేసుకుంది. ‘మిషన్‌ హోప్‌’ కార్యక్రమంతో కొవిడ్‌ బాధితులకు స్వాంతన చేకూరడంతోపాటు ఆర్థికంగానూ ఎంతో వెసులుబాటు కలుగుతుందని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా తెలిపారు. కష్ట కాలంలో దేశ ప్రజలకు సేవ చేయడంలో భాగస్వాములైనందుకు ఎంతో సంతోషిస్తున్నామని పోర్టియా మెడికల్‌ సీఈవో, కో-ఫౌండర్‌ మీనా గణేశ్‌, కేవీఎన్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ వెంకట్‌ కే నారాయణ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌

ట్రెండింగ్‌

Advertisement