శంకరపట్నం, సెప్టెంబర్ 3 : ఆ యువకుడికి అంధత్వం అడ్డు కాలేదు.. లక్ష్యం చేరేందుకు సాకు కాలేదు.. రెండు కండ్లు కనిపించకపోయినా కృషి పట్టుదలతో ఢిల్లీ జేఎన్యూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన వెంగల రఘుకు పుట్టుకతోనే రెండు కండ్లు కనిపించవు. అయినా పట్టుదలతో చదివాడు.
జేఎన్యూ 2025-26లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషియాలజీ విభాగంలో పీజీ పూర్తి చేశాడు. ఇటీవల జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నిర్వహించిన పీహెచ్డీ ఎంట్రెన్స్ రాశాడు. ఈ నెల ఒకటిన విడుదల చేసిన ఫలితాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు అతడి తండ్రి రాజు తెలిపారు.