హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో వైస్చాన్స్లర్ల నియామకానికి దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 10 వర్సిటీల వీసీ పోస్టులకు 280 దరఖాస్తులు వచ్చాయి.
కొందరు పోస్టల్ ద్వారా పంపుతుండటంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది. వీసీల నియామకానికి విద్యాశాఖ గత నెల 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది గడువు అయిన సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 280కిపైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.