వకీల్ సాబ్ చిత్రంలోని మగువా మగువా అనే పాట ఎంత ఫేమస్ అండ్ పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను బుల్లితెర యాంకర్ రవి స్పూఫ్ చేశాడు. పురుషా పురుషా అంటూ పేరడి చేసి ఇందులో ఇంట్లోని పనులన్నింటి తానే చేస్తున్నట్టు వీడియో రూపొందించి దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది ఇన్‌స్టాలో 400వ పోస్ట్, మగజాతి ఆణిముత్యాలకు దీనిని అంకితం ఇస్తున్నట్టు రవి పేర్కోన్నాడు.
యాంకర్ రవి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వీడియోకు భాను, వింద్య, వర్షిణి వంటి యాంకర్స్ కూడా సరదాగా స్పందించారు. ఇంట్లో ఎప్పుడు పని చేసినట్టు కనిపించవు, నీ భార్య నిత్యతో పనులు చేయించి వీడియో కోసం ఇలా చేశావా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. రవి భార్య నిత్య.. వీడియోల వెనుక ఏం జరిగింది చెప్పమంటావా అని బెదిరించగా, మీరు ఎన్ని చేసిన మా ఉద్యమం ఆగదు అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.