హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా అరెస్టు చేసిన ఓయూ విద్యార్థులను విడుదల చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర పాలన కంటే అమానుషంగా విద్యార్థులను, విద్యార్థి నేతలను అరెస్టు చేశారని, ఇక విద్యార్థుల నుంచి కాంగ్రెస్ సర్కారుకు అడుగడుగునా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాలకేయుడిలా ఓయూ క్యాంపస్లో అడుగుపెట్టిన రేవంత్. తుపాకుల పహారాలో ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ఓ యూ చుట్టూ కంచెలు పరిచి దండుపా ళ్యం ముఠాలా వర్సిటీ గడ్డపై అడుగుపెట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ను దూ షించడం తప్ప.. ఓయూకు నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. ఉత్త చేతు లు, వట్టి మాటలతో విద్యార్థుల ముం దు అభాసుపాలయ్యారని తెలిపారు.