హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ సువర్ణావకాశం కల్పించింది. ఓయూ పరిధిలోని అన్ని కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీ, బీఎస్‌డబ్ల్యూ కోర్సులను 2000 నుంచి 2015 మధ్య చదివిన వారికి వన్ టైం చాన్స్ ఇస్తున్నట్టు ఎక్జామినేషన్ కంట్రోల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
2015-16 విద్యాసంవత్సరం సిలబస్ ప్రకారమే పరీక్షలుంటాయని పేర్కొన్నారు. అపరాధ రుసుము లేకుండా జూన్ 17లోపు సంబంధిత కళాశాలల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు. వివిధ కారణాలతో మళ్లీ పరీక్ష రాయనివారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.