OU | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి ఆందోళనలు నిర్వహించకుండా జారీచేసిన సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకునేలా చూడాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ.. ప్రొఫెసర్ కోదండరాంను విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కోదండరాం నివాసంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేసి చర్చించారు.
అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఓయూలో ఆందోళనలపై నిషేధం విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి సర్క్యులర్ ను ఉపసంహరించుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.