OU EXams Postpone | ఉస్మానియా యూనివర్సిటీ : గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలో అన్ని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, బీఈడీ రెండు, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు చెప్పారు. తిరిగి పీజీ కోర్సుల పరీక్షలను ఈ నెల 10న, బీఈడీ పరీక్షలను 19వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.