Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఈ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, వివిధ సాంకేతిక కారణాల రీత్యా దానిని వాయిదా వేసుకున్నట్లు వివరించారు. పరీక్షలను తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.