Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 26న జరగనున్న 108వ ఆవిర్భావ దినోత్సవ వాల్పోస్టర్ను మంగళవారం రిజిస్టార్, ఓఎస్డీ, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, డైరెక్టర్లతో కలిసి ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ఆవిష్కరించారు.
వీసీ మాట్లాడుతూ.. విద్య, పరిశోధనా రంగాల్లో ఓయూ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పబ్లిక్ అఫైర్స్ సలహాదారు, ఓయూ పూర్వ విద్యార్థి కె. కేశవరావు ముఖ్య అతిథులుగా, ఓయూ పూర్వవిద్యార్థి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఓయూ వ్యవస్థాపకుడునిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు, నవాబ్ మీర్ నజఫ్ అలీఖాన్ గౌరవ అతిథులుగా పాల్గొంటారని చెప్పారు.
ఆర్ట్స్ కళాశాలకు అరుదైన ఘనత
ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో చోటు దక్కించుకుంది. దేశంలోనే ముంబై తాజ్ హోటల్, స్టాక్ ఎక్చేంజ్ తరువాత ట్రేడ్ మార్క్ కలిగిన మూడో కట్టడంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది. ఈ మేరకు ట్రేడ్ మార్క్ రిజిస్టేష్రన్ ధృవపత్రాన్ని ఓయూ పూర్వ విద్యార్థి సుభజిత్ సాహా ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్కు అందించారు.