Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ ఐప్లెడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.