Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.