Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎండీహెచ్ఎం) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ఈనెల 14వ తేదీ నుంచి, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ లో బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 15వ తేదీ నుంచి, దూరవిద్య ద్వారా అందించే ఎంసీఏ, పీజీడీసీఏ, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీన పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.