హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. యూనివర్సిటీ జర్నలిజం విభాగం ‘రిప్రజేంటేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ దళిత్స్ ఇన్ మీడియా’ అనే అంశంపై క్రిశాంక్ సిద్ధాంత గ్రంథం సమర్పించారు. ప్రొఫెసర్ కరణం నరేందర్ పర్యవేక్షణలో ఆయన పీహెచ్డీ చేశారు. మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేసి న క్రిశాంక్ ఇప్పటికే యూజీసీ నెట్ అర్హతసాధించి, కీలకమైన ప్రాజెక్టులో రీసెర్చ్ ఫెలోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.