హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగా ణ రాష్ట్ర వికలాంగుల సలహామండలి సభ్యు డు నారా నాగేశ్వర్రావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసిం ది. ‘దివ్యాంగుల సాధికారత-కార్పొరేట్ సా మాజిక బాధ్యత’ అనే అంశంపై ఓయూ మేనేజ్మెంట్ విభాగంలో సహ ఆచార్యులైన డాక్టర్ విద్యాసాగర్‌రావు పర్యవేక్షణలో పరిశోధన సాగించి, సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించగా, ఓయూ డాక్టరేట్‌ను ప్రకటించింది.
నాగేశ్వర్రావు వికలాంగుల హక్కుల చట్టం 2016 రాష్ట్రస్థాయి నియమావళి రూపకల్పన సభ్యులుగా, వివిధ శాఖల్లో ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ కల్పనకు కృషి చేశారు. దివ్యాంగులు, బాలలు, యువజనులకు సేవలందించినందుకు జాతీయస్థాయిలో నాలుగు అవార్డులను అందుకున్నారు. నాగేశ్వర్రావును పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రి డాక్టర్ అనసూయ (సీతక్క) అభినందించారు.