ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 19: ఉస్మానియా యూనివర్సి టీ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
ఇండియన్ సోషియాలాజికల్ సొసైటీ(ఐఎస్ఎస్-న్యూఢిల్లీ) ఏటా అందించే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఈ ఏడాది సత్యనారాయణకు అందించనున్నట్టు ఐఎస్ఎస్ అధ్యక్షురాలు మైత్రేయి చౌదరి తెలిపారు. విద్య,పరిశోధన రంగాల్లో విశేషకృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.