హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఏ మెడికల్ కళాశాలకు లేని ప్రత్యేకత ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల పనితీరు, ఆయా దవాఖానల్లో అత్యాధునిక వసతుల కల్పన తదితర అంశాలపై మంత్రి మంగళవారం సెక్రటేరియట్లోని తన చాంబర్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒకటి లేదా రెండు దవాఖానలు మాత్రమే ఉంటాయని.. కానీ, ఉస్మానియా కాలేజీకి మాత్రం 10 అనుబంధ దవాఖానలు ఉన్నట్టు మంత్రి గుర్తుచేశారు. 5 వేలకు పైగా బెడ్లతో, ఒకో హాస్పిటల్ ఒకో స్పెషాలిటీలో లక్షల మందికి సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.