బ్లేడ్లు మింగిన యువకుడికి కొత్త జీవితం
మానసిక వైకల్యంతో బాధపడుతూ బ్లేడ్లు మింగి ప్రాణాలపైకి తెచ్చుకున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. తాండూరులోని ఇందిరానగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ కుమారుడు ముజీబుర్ రహమాన్ (16) మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు.
- ప్రాణాలు కాపాడిన ఉస్మానియా వైద్యులు
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 4 : మానసిక వైకల్యంతో బాధపడుతూ బ్లేడ్లు మింగి ప్రాణాలపైకి తెచ్చుకున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. తాండూరులోని ఇందిరానగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ కుమారుడు ముజీబుర్ రహమాన్ (16) మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 3న రేజర్ బ్లేడ్లు మింగిన ముజీబుర్ రహమాన్‌ను తండ్రి గమనించి ఉస్మానియా దవాఖానకు తీసుకొచ్చారు.
యువకుడికి ఎక్స్‌రే, ఇతర పరీక్షలు చేసిన జనరల్ సర్జరీ విభాగం వైద్యులు.. తదుపరి చికిత్స నిమిత్తం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి రిఫర్ చేశారు. అనంతరం మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రమేశ్, అసోసియేట్ ప్రొఫెసర్ సాహిత్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆశికా, సయ్యద్ నదీమ్ తదితరులు ఎండోస్కోపీ పద్ధతిలో ముజీబుర్ రహమాన్ ఉదర భాగం నుంచి బ్లేడ్ ముక్కలు తొలగించారు. యువకుడి దేహంలోని ఇతర భాగాలకు ఎలాంటి గాయాలవకుండా సురక్షితంగా శస్త్రచికిత్స పూర్తిచేసిన రమేశ్ కుమార్ బృందాన్ని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్ ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

