భూత్పూర్, సెప్టెంబర్ 4 : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో శుక్రవారం బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం జరుగుతుండగా కేటీఆర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్న ప్రతి కార్యకర్తనూ అభినందించారు. ‘1,000 రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ప్రజలకు చేసింది గుండు సున్నా..
కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలి, కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు ఎవ్వ రూ భయపడవద్దు.. మళ్లా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.. మన నేత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. మీ నాయకుడు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తాడు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే దేవరకద్ర నియోజకర్గానికి వస్తానని కేటీఆర్ వెల్లడించగా.. ఆల కృతజ్ఞతలు తెలిపారు.