ముంబై : పలు మెడల్స్ సాధించిన జాతీయ మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (30) పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆరేండ్ల కొడుకుతో పాటు రెండున్నరేండ్ల ఇద్దరు కవల ఆడపిల్లలతో కలిసి గురువారం నల్దుర్గ్ కోట నుంచి 150 అడుగుల లోయలోకి దూకేసింది. ఈ ఘటనలో అశ్విని, ఆమె కొడుకు అక్కడికక్కడే మరణించారు. కవల పిల్లల్లో ఒకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
అశ్విని 2007, 2008, 2009లో అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ఆమె భర్త మనోహర్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. అశ్విని ఉమర్గ తెహ్సిల్లోని తన పుట్టింట్లోనే ఉంటున్నది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గురువారం తన ముగ్గురు పిల్లలతో కోట వద్దకు వచ్చిన అశ్విని.. ముందుగా పిల్లల్ని తోసేసి తర్వాత తాను కిందికి దూకేసిందని స్థానికులు చెబుతున్నారు.