శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చంద్రయాన్’. దర్శకనిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, అడ్వెంచర్ నేపథ్య కథాంశమిది. శుక్రవారం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
మందమర్రికి చెందిన ముగ్గురు యువకులు తమ వద్ద ఉన్న వివిధ వస్తువులతో సొంతంగా రాకెట్ తయారుచేసి చందమామను చేరుకునేందుకు చేసే ప్రయత్నాలతో మోషన్ పోస్టర్ ఆసక్తినిరేకెత్తిస్తున్నది. వారు చేపట్టిన ఈ సాహసం వెనకున్న కారణాలేమిటి? శాస్త్రవేత్తలకే సవాలుగా అనిపించే చంద్రయాన్‌లో ఈ ముగ్గురు యువకులు విజయం సాధించారా?లేదా? అనే అంశాలతో మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది.