మొయినాబాద్, మార్చి 3 : రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్ పరిధిలోని విద్యాజ్యోతి ఇం జినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్-స్పోర్ట్స్ ఫెస్ట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రో జుల ఈ కల్చరల్ ఫెస్ట్‌లో 75 కాలేజీలకు చెం దిన సుమారు 4 వేల మంది విద్యార్థులు ఆటలు, పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే మీడియా పార్ట్నర్గా వ్యవహరించాయి. నమస్తే తెలంగాణ ‘నాడునేడు’ శీర్షికతో ప్రచురించిన బతుకమ్మ పుస్తకాన్ని విద్యార్థులు ఎంతో ఆసక్తితో చదివారు. రెండోరోజు శుక్రవారం వివిధ కళాశాలల విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, ఇంటర్ గేమ్స్ ఆడి తమ ప్రతిభను కనబరిచారు. విద్యార్థులను, నిర్వాహకులను ఫెస్ట్ కో ఆర్డినేటర్లను కళాశాల డైరెక్టర్ డాక్టర్ సాయిబాబారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. శనివారం విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో వీజేఐటీ డైరెక్టర్ డాక్టర్ సాయిబాబారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పద్మజ, ప్రోగ్రాం కన్వీనర్ బీ శ్రీనివాస్, కో -కన్వీనర్ డాక్టర్ ఓబులేశ్, డాక్టర్ జె రమేశ్ బాబు, సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వెంకటాచలం, అకడమిక్ కో ఆర్డినేటర్ జీ శ్రీలత పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ఎలక్ట్రికల్ వెహికిల్
ఈ టెక్నో ఫెస్ట్‌లో ట్రిబుల్-ఈ విభాగం విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులను టీఎస్ఐసీ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌటం అభినందించారు.