హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు లో విశేషంగా రాణించిన నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ రైతు లోకసాని పద్మారెడ్డికి సేంద్రియ చాంపియన్ అవార్డు లభించింది. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో రెండ్రోజులపాటు నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ అవార్డును అందజేశారు.