ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 12:43:44

బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి

బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి

పెద్దపల్లి : బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. జూలై 2న తేదీన సమ్మె చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు బి.వెంకట్రావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చర్యలతో బొగ్గు గని కార్మికుల హక్కులను కాలరాసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వ బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం అవుతుందని, వెంటనే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎల్లవేళలా కార్మికుల హక్కుల పరిరక్షణలో ముందుంటుందన్నారు. జూలై 2న జరిగే ఒక రోజు సమ్మెలో కార్మిక వర్గంతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవా వెంకటేశం, కొత్త సత్యనారాయణ రెడ్డి, బేతి చంద్రయ్య, శంకర్ నాయక్, రావుల బనాకర్, సిరంగి శ్రీనివాస్, పైడిపల్లి ప్రభాకర్, వెంకటేష్, కృష్ణ  నరసయ్య, ఆకుల రాజయ్య, రాజేశం, గట్టయ్య, ఓదెలు, శ్రీశైలం, మేకల శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు.


logo