హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటా(ఎంక్యూ1, ఎంక్యూ2/ఎన్ఆర్ఐ) రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు కాళోజీ వర్సిటీ తెలిపింది. శనివారం ప్రకటన విడుదల చేసింది.
ఫైనల్ మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు నేడు(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 27 ఉదయం 8 గంటల వరకు https:// pvttspgmed.tsche.in ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది.