హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఓపెన్ స్కూల్ ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. సెప్టెంబర్లో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను www.telanganaope nschool.org వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొన్నారు.
నేటి నుంచి పది పరీక్ష ఫీజుల స్వీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 30 నుంచి నవంబర్ 13 వరకు ఫీజు చెల్లించే అవకాశానిచ్చింది. రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 29, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 వరకు పరీక్ష ఫీజులు స్వీకరించనున్నారు. ఆయా తేదీల్లో విద్యార్థులు పాఠశాల హెచ్ఎంలకు ఫీజులు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.