Open Schools | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్ష ఫీజును ఆలస్య రుసుము లేకుండా 2026 జనవరి 5 వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు. రూ.25 ఆలస్య రుసుముతో జనవరి 6 నుంచి 12 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో జనవరి 13 నుంచి 16 వరకు, తాత్కాల్ కింద జనవరి 17 నుంచి 19 వరకు చెల్లించవచ్చని ఓపెన్ స్కూల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్‌టికెట్లు శనివారం విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం తర్వాత హాల్‌టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరచనున్నది. టెట్ పరీక్షలను 2026 జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షకు ఈ సారి 2.37లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 71వేల మంది ఇన్‌సర్వీస్ టీచర్లు ఉన్నారు. మరో 1.66లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలి టీ టెస్ట్‌కు(సీటెట్)వచ్చిన దరఖాస్తులు అసంపూర్ణంగా ఉన్నాయి. మొత్తంగా 1,61,127 మంది అభ్యర్థులు దరఖాస్తులను సగమే పూరించారు. దీంతో సీబీఎస్ఈ ఈనెల 30 వరకు దరఖాస్తులు పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చింది.