సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:08

ఉర్జా క్లీన్‌ టెక్‌ ఎయిర్‌క్లీనర్‌ ఆవిష్కరణ

ఉర్జా క్లీన్‌ టెక్‌ ఎయిర్‌క్లీనర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గాల్లో వైరస్‌ను అంతమొందించే సరికొత్త పరికరం రూపుదిద్దుకున్నది. దక్షిణకొరియా తయారుచేసిన ఎయిర్‌క్లీనర్‌ పరికరాన్ని ఉర్జా క్లీన్‌ టెక్‌ సంస్థ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. ఎయిర్‌క్లీనర్‌ గాలిలో వ్యాప్తిచెందిన వైరస్‌ను లాక్కొని చంపేస్తుందని, ఈ పరికరం ఉన్న పరిసరాల్లో వ్యాధులు సంక్రమించవని సంస్థ ఎండీ మధుసూదన్‌రావు తెలిపారు. దవాఖానలు, షాపింగ్‌మాళ్లు, సినిమా థియేటర్లలో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు.


logo