యాదాద్రి, జూలై 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నారసింహుడికి నిత్యారాధనలు జరిపారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన, సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవా కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఖజానాకు శుక్రవారం రూ.11,18,889 ఆదాయం వచ్చినట్టు ఈవో గీత తెలిపారు.