సాగర్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం: మంత్రి తలసాని
టీఆర్ఎస్| నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రులు తలసాని

నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ అనుమల మండలం పాలెం, చింతగూడెం, రామడుగులో ప్రచారం చేశారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశానని చెప్పుకోవడం తప్ప జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు పెట్టుబడికోసం ఎకరానికి రూ.10 వేలు ఆర్థికసాయం, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. ఈనెల 17న టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు ఓటేసి అభివృద్ధికి పట్టంకట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని మంత్రి శీనివాస్‌గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ను గెలిపిస్తే సాగర్ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సాగర్ ఉపఎన్నికలో భగత్ గెలుపు కాయమని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
ఐపీఎల్లో నైట్‌రైడర్స్ 100వ విజయం.. షారుక్‌ఖాన్ రియాక్షన్ ఇదీ
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
ఆవిష్కరణ పంపండి.. రూ. 5లక్షలు పొందండి
రాష్ట్రంలో కొత్తగా 2251 కరోనా కేసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

