TSPSC Group-1 | తలకిందులైన అంచనాలు.. గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌కు ఆదరణ కరువు!
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆదరణ తగ్గినట్టుగా కనిపిస్తున్నది. గత నెల 19న గ్రూప్1 నోటిఫికేషన్ జారీ కాగా, అదే నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు.
- ఇప్పటికీ కేవలం 2.70 లక్షల దరఖాస్తుల నమోదు
- ముందుకురాని నిరుద్యోగ అభ్యర్థులు
- నేటితో ముగియనున్న తుది గడువు
- పాత గ్రూప్-1కు 3.80 లక్షల అప్లికేషన్లు
- 5.50 లక్షల మంది పోటీపడతారని టీఎస్పీఎస్సీ భావన
TSPSC Group-1 | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆదరణ తగ్గినట్టుగా కనిపిస్తున్నది. గత నెల 19న గ్రూప్1 నోటిఫికేషన్ జారీ కాగా, అదే నెల 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 14 వరకు దరఖాస్తుల తుది గడువుగా నిర్ణయించారు. అయితే, 13 వరకు (బుధవారం) 2.70 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొన్నారని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పాత గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 500 పోస్టులకు భారీగా 3.80 లక్షల దరఖాస్తులు నమోదైనట్టు గతంలో టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుతం గ్రూప్1 ఉద్యోగాలకు పోటీపడేందుకు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపుతలేరన్న విషయం తేటతెల్లమవుతుంది.
5.50 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా..
ఇదిలావుండగా, కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్లో మొత్తం 563 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దాదాపు 5.50 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉన్నదని టీఎస్పీఎస్సీ అధికారులు అంచనా వేశారు. కానీ, కేవలం 2.70 లక్షల దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. దరఖాస్తులకు గురువారం తుది గడువుగా ఉన్నది. ఒక్క రోజులో ఎంతలేదన్నప్పటికీ మరో 50 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. ఈసారి గ్రూప్-1లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకొంటారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావించింది. వచ్చే లోకసభ ఎన్నికలలో నిరుద్యోగ అభ్యర్థులను కూడా ప్రసన్నం చేసుకోవచ్చని ఆశించింది. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

