భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. వచ్చే నెల 3 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనం ఉత్సవాలు ఉంటాయన్నారు.
13న స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో టికెట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. టికెట్ల ధరలను వీవీఐపీ నుంచి సామాన్య కోటా వరకు రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.500, రూ.250గా నిర్ణయించారు. ఆన్లైన్ టికెట్లను వెబ్సైట్ www. bhadrachalamonline.com ద్వారా పొందవచ్చని సూచించారు.