TGSRTC | హైదరాబాద్, మార్చి 2 (నమస్త తెలంగాణ): ఆర్జీసీ బస్సుల్లో చిల్లర సమస్యను తీర్చేందుకు యాజమాన్యం కీలకనిర్ణయం తీసుకుంది. క్యూఆర్‌కోడ్ స్కానింగ్‌తో ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించింది. ప్రయాణికులు బస్సుల్లో వెళ్లే సమయాల్లో తగినంత చిల్లర లేకపోవడం.. ఈ విషయంలో కండక్టర్లకు సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో సమస్యకు స్వస్తి పలికేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.