హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ, యూజీ కళాశాలల్లో ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. వర్సిటీ పరిధిలోని ప్రిన్సిపల్స్, ఇతర అధికారులతో సోమవారం సమావేశమైన ఉన్నతాధికారులు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వర్సిటీ పరిధిలోని అన్ని యూజీ, పీజీ కోర్సుల ప్రస్తుత సెమిస్టర్ తరగతులను ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలలో కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో సహా అందరూ విధులకు నేరుగా మంగళవారం నుంచి హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆన్లైన్ తరగతులను కళాశాల నుంచే తీసుకోవాలని సూచించారు.