RC | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ప్రైవేటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) గడువు 15 సంవత్సరాలపాటు ఉంటుంది. ఇది ముగిసిన అనంతరం ప్రతి ఐదేండ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. లేకుంటే ఆర్టీవో అధికారుల తనిఖీల్లో పట్టుపబడినప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఆర్సీ రెన్యువల్ చేసుకోకుంటే సంవత్సరానికి వాహనం ఖరీదులో 10 శాతం వరకు అదనంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. న్యాయపరమైన చికులు రాకుండా ఉండాలంటే గడువు ముగిసే తేదీకి ముందే రెన్యువల్ చేసుకోవడం ఉత్తమం. ఇందుకు ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్సీ రెన్యువల్‌కు ఫారం-25, దరఖాస్తు ఫారం, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్, ఆర్‌సీబుక్, ఫిట్నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, రోడ్‌టాక్స్ చెల్లించిన డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, పాన్‌కార్డు, చాసిస్, ఇంజిన్ పెన్సిల్ పాయిం ట్ తదితరాలు అవసరమవుతాయి.