హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి చేతకానితనంతోనే గ్రూప్-1 రాత పరీక్షల్లో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనునాయక్ విమర్శించారు. ప్రభుత్వం గ్రూప్-1 రాత పరీక్షను రద్దు చేసి.. రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. సోమవారం చిక్కడపల్లి సిటీ సెంట్రల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గ్రూప్-1 పోస్టులను అమ్ముకోవడంతో ఎన్నో ఏండ్లుగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. కేసులో నిందితులను శిక్షించడానికి లక్ష మంది నిరుద్యోగుల సంతకాలను సేకరించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించనున్నట్టు పేర్కొన్నారు.