యాదాద్రి, మార్చి 1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి పలువురు విరాళాలు అందజేస్తున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన కోడి సోములు-సలెమ్మ దంపతులు మంగళవారం రూ.1,00,116 విరాళమిచ్చారు. ఇందుకు సంబంధించిన నగదును యాదాద్రిలో ని బాలాలయంలో అధికారులకు అందజేశారు.