ములుగు : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. గోవిందరావుపేట మండలం పస్రా ఫారెస్ట్ చెక్ పోస్ట్ కు అర కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారిపై ఇసుక లారీ అదుపుతప్పి సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్ తో పాటు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మ`తి చెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Indraja | నిర్మాతని కంటతడి పెట్టించిన ఇంద్రజ.. జయసుధ తర్వాత ఆమే నాకు ఇష్టమైన హీరోయిన్..
Gujarat Crime | గుజరాత్లో ఘోరం.. శుద్ధీకరణ పేరుతో మహిళపై గ్యాంగ్ రేప్