NagarKurnool | నాగర్‌కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దండ మండలం పెద్దాపూర్ వద్ద అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును, బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది గాయపడ్డారు. బాధితులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.