హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రతి 500 పశువులకు ఒక గోశాల ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా 30-40 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా 75-100 మందికి పరోక్ష జీవనోపాధి అవకాశాలు సృష్టిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ చెప్పారు.
గోశాలలకు ఏడాదికి 1కోటి ఆర్థిక సాయం అందించే కార్పొరేట్ కంపెనీలు బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ సభ్యత్వాన్ని పొందుతాయని తెలిపారు. ఈ మేరకు ఆయన గోశాల ప ర్యావరణ వ్యవస్థ అభివృద్ధి విధానం -2025 పాలసీని విడుదల చేశారు.